Namaste NRI

20 కంపెనీలకు పీవీ సింధు షాక్

బ్యాడ్మింటన్‌ కాంస్య పతకం సాధించి దేశ వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాధించుకున్న పీవీ సిందు 20 కంపెనీలకు షాక్‌ ఇచ్చింది. తన అనుమతి లేకుండా తన పేరుతో వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలపై దావా వేసింది. ఒక్కో కంపెనీపై రూ. 5 కోట్ల మేర దావా వేసింది. దేశ వ్యాప్తంగా సింధు పేరు పాపులర్‌ అయ్యింది. పీవీ సింధు పేరు, ఫొటోతో కొన్ని కంపెనీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. దీనికి ఆమె నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని ఆమె వివరించింది. అందుకే ఈ కంపెనీలపై కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. ఏ సెలబ్రెటీ అయిన ఓ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉంటే ఆ కంపెనీ మార్కెట్‌ భారీగా పెరుగుతుంది. 20 కంపెనీల్లో ఇప్పటికే 15 కంపెనీలకు నోటీసులు కూడా పంపించారు.

                 ఇందులో హ్యాపీడెంట్‌, పాన్‌ బహార్‌, యూరేకా ఫోర్బ్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వొడాఫోన్‌ ఐడియా, ఎంజీ మోటర్స్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పినో ఫేమెంట్స్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌తో పాటు విప్రో లైటింగ్‌ ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events