Skip to main content

Namaste NRI

త్వరలో ప్యార్‌ ప్రేమ కల్యాణం

ఎలన్‌, శాన్వీమేఘన జంటగా నటించిన చిత్రం ప్యార్‌ ప్రేమ కల్యాణం. ఎలన్‌ దర్శకత్వంలో శ్రీనిధిసాగర్‌ నిర్మించారు. ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ సీరియస్‌ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చూపించామని, ఆద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిదని నిర్మాత శ్రీనిధిసాగర్‌ తెలిపారు.పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తే ఎలాంటి బాధలు పడతారనే అంశాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించామని కథానాయిక శాన్వీ మేఘన చెప్పింది. కేవలం 32 రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌బాబు, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కథ, స్క్రీన్‌ప్లే: నివేదిత, దర్శకత్వం: ఎలన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events