Skip to main content

Namaste NRI

ట్విటర్‌ నుంచి పిట్ట పోయి..ఎక్స్‌ వచ్చే

ట్విట్టర్‌కు సరికొత్త రూపు తీసుకొస్తానన్న ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ లోగో నుంచి పిట్టను తొలగించి ఎక్స్‌ ను ఆవిష్కరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఎక్స్‌ను ప్రదర్శించగా, ఈ ఫొటోను ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ డాట్‌కామ్‌ ఇక నుంచి ద ఎక్స్‌.కామ్‌ గా రీడైరెక్ట్‌ చేస్తున్నట్టు మస్క్‌ ప్రకటించారు. నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు రంగులోని ఎక్స్‌ అనే గుర్తును మస్క్‌ ఎంచుకున్నారు. కంప్యూటర్లన్నింటిపైనా కొత్త లోగో కనిపించగా, మొబైల్‌ యాప్‌లో పాత లోగో పిట్ట కొనసాగటం గమనార్హం.

Social Share Spread Message

Latest News