ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రతిజ్ఞ ద్వారా హిందూ దేవతలను కించపరిచారంటూ న్యాయవాది మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ కోర్టు జడ్జి కరీంనగర్ పోలీసులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి వడుకపూర్ గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో హిందూ దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.