Namaste NRI

ఇండియన్‌ కాన్సులేట్‌లో ఘనంగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి

 విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 161 జయంతిని దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌లో  ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాసిన ఠాగూర్‌ బియాండ్‌ హారిజోన్‌ అనే ఆల్బమ్‌లో 3 ఐకానిక్‌ పాటలను విడుదల చేశారు. దుబాయిలోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అమన్‌ పూరి పాటలను విడుదల చేశారు.  ఠాగూర్‌ రాసిన మూడు పాటలు అరబిక్‌లోకి అనువదించడం, సమర్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ మూడు పాటలను ప్రఖ్యాత ఎమిరాటి కవి డా. షిహాబ్‌ ఘనేమ్‌ బెంగాల్‌ భాష  నుంచి అరబిక్‌లోకి అనువదించారు. ఈ పాటలను దేవ్‌ చక్రవర్తి స్వరపరిచారు. సంగీతాన్ని అందించారు. 130 భాషల్లో పాలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన సుచేత సతీష్‌ ఈ మూడు పాటలను పాడారు. ఈ కార్యక్రమానికి టాడు మాము అధ్యక్షత వహించారు. భారతీయ పునరుజ్జీవనానికి ఠాగూర్‌ చిహ్నం లాంటివారిని అన్నారు. ప్రజల్లో పాతుకుపోయిన  సంగీత సంప్రదాయం అభివృద్ధికి ఠాగూర్‌ అపారమైన కృషి చేసినట్లు తెలిపారు. సుచేత, దేవ్‌ చక్రవర్తి కలిసి బెంగాలీ నుంచి అరబిక్‌లోకి అనువదించిన పాటలను ఆలపించారు. భారత్‌, యూఏఈ అనువాదంపై పనిచేస్తున్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరంకు చెందిన ప్రదీప్‌ మురళీ, సుమీత, కుంభాల మహేందర్‌ రెడ్డి, శివ కుమార్‌, ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events