Namaste NRI

ఆస్ట్రేలియాలో వ‌ర్ణ‌వివ‌క్ష‌.. భార‌తీయ విద్యార్థిపై

ఆస్ట్రేలియాలో భార‌తీయుడిపై అటాక్ జ‌రిగింది. 23 ఏళ్ల విద్యార్థి చ‌ర‌ణ్‌ప్రీత్ సింగ్‌ను కొట్టారు. సెంట్ర‌ల్ అడిలైడ్‌లో ఆ దాడి ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. వ‌ర్ణ‌వివ‌క్ష పేరుతో అటాక్  జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కింటోర్ అవెన్యూ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సిటీ లైట్ డిస్‌ప్లేను చూసేందుకు భార్య‌తో క‌లిసి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.

అయిదుగురు వ్య‌క్తులు ప‌దునైన ఆయుధాల‌తో వ‌చ్చి దాడి చేశారు. ఎటువంటి వార్నింగ్ ఇవ్వ‌కుండానే పంచ్‌లు విసిరారు. అటాక్ చేసి దుర్భాష‌లాడారు. రోడ్డుపై సింగ్ అప‌మార‌క‌స్థితిలో ప‌డిపోయాడు. తీవ్ర గాయాల‌య్యాయి. ఇండియ‌న్ అని తిడుతూ,  వాళ్ల పంచ్‌లు విసిరిన‌ట్లు సింగ్ తెలిపాడు. దాడి చేస్తున్న దృశ్యాల‌ను సింగ్ భార్య షూట్ చేసింది. కారు రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌ను వీడియో తీసింది. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు…

Social Share Spread Message

Latest News