వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి జంటగా నటించిన చిత్రం రాధా మాధవం. దాసరి ఇస్సాకు దర్శకత్వం. గోనాల వెంకటేష్ నిర్మాత. మేక రామకృష్ణ, జయప్రకాష్, ప్రియ, నవీన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రైలర్ బాగుందని మంచి పల్లెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగిం చిందని వెల్లడించారు. ఇక ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ జంట ప్రయాణానికి దృశ్య రూపంలా నిలుస్తుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి అన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తాజ్ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్ వెంకట్ బాలా, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.















