Namaste NRI

ఆపరేషన్ రావణ్ లో జీవితగా రాధికా శరత్ కుమార్

రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆపరేషన్ రావణ్. సంగీర్తన విపిన్ నాయిక. వెంకట్ సత్య దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఈ చిత్రంలో జీవితగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను  రాధికా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ఇందులో నేను జీవిత అనే పాత్రను పోషించాను. గతంలో నేను నటించిన స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలు ఈ సినిమాలోని ఈ పాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయి. దర్శకుడు వెంకట సత్య చెప్పిన ఆపరేషన్ రావణ్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. నాది ఎంతో హృద్యమైన పాత్ర అని అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ న్యూ ఏజ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రాధికా పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని,  ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి అన్నారు. చరణ్‌రాజ్‌, కాంచి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొళ్లేటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress