రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు విడుదలకు సిద్ధమౌతోంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈవిల్ ఈజ్ నా బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.














