Skip to main content

Namaste NRI

డైరెక్టర్ చందు మొండేటి చేతుల మీదుగా రహస్యం ఇదం జగత్ ట్రైలర్ లాంచ్

రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందిన సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ రహస్యం ఇదం జగత్‌. కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు చందు మొండేటి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. నాకిష్టమైన అంశాలన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. నిజంగా చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. టెక్నాలజీకి అంతపట్టని వామ్‌హోల్‌ కాన్సెప్ట్‌ నేపథ్యంలో ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం జనాలు ఇలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు అని చందు మొండేటి అన్నారు. ఓ అందమైన చందమామ కథలా సినిమా ఉంటుందని, గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని, ప్రచార చిత్రాలకు అనూహ్యమైన స్పందన వస్తున్నదని, సినిమా అంతకు మించి ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌ 8న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News