ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. శిక్షను నిలుపుదల చేస్తే, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అయితే శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ చేసిన అభ్యర్థనను సెషన్స్ కోర్టు, హైకోర్టు నిరాకరించాయి. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
