భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధినెడ్ ప్రైస్ తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్`చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నెడ్ ప్రైస్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్, పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనా) మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేద్దామని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) మేం కచ్చితంగా సమర్థించలేం అని అన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని అన్నారు. అంతేగాక, పాకిస్థాన్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని నెడ్ పైస్ చెప్పడం గమనార్హం.