Namaste NRI

రాహుల్‌ విజయ్‌ శివాని రాజశేఖర్‌ కొత్త చిత్రం

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌  హీరో హీరోయిన్లుగా  నటిస్తున్నారు. ఏటర్నిటీ ఎంట్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ 2గా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యాక్రమాలతో ప్రారంభమైంది. జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  తెల్లవారితే గురువారం చిత్రాన్ని తెరకెక్కించిన మణికాంత్‌ గెల్లినే దీనికి దర్శకుడు. మ్యారేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఒక కథ. పెళ్లి నేపథ్యంతో పాటు, పెళ్లైన జంట మధ్య అహం ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది.  ఈ మూవీకి  కల్యాణి మాలిక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనుంది చిత్ర యూనిట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events