Namaste NRI

రాజ్‌తరుణ్‌ తిరగబడరాసామీ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్

రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం తిరగబడరాసామీ. మల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం.  మల్కాపురం శివకుమార్‌ నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. తిరగబడరాసామీ అంటూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రాయగా, జేబీ స్వరపరిచారు. సాయిచరణ్‌, లోకేశ్వర్‌ ఈదర, చైతు సత్సంగి ఈ పాటను ఆలపించారు. రాజ్‌తరుణ్‌ పాత్ర తీరుతెన్నులను ఆవిష్కరించేలా ఈ పాట సాగిందని చిత్రీకరణ చూస్తే అర్థమవుతున్నది. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న చిత్రంలో మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్‌విజయ్‌, అంకిత ఠాకూర్‌ ఇతర పాత్రధారులు. ఆగస్ట్‌ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.   ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, నిర్మాణం: సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress