Skip to main content

Namaste NRI

రాజా ది రాజా అందరికీ కనెక్ట్ అయ్యే కథ : నిహారిక దాసరి

రుత్విక్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ రాజా ది రాజా. నిర్మాత కె.నిహారిక దాసరి. అనిల్‌ బోయిడపు దర్శకుడు. నిహారిక దాసరి విలేకరులతో మాట్లాడారు. ఇది చాలా బలమైన కథ. ఇందులో రెండు విభిన్నమైన ఛాలెంజింగ్‌ పాత్రల్లో హీరో రుత్విక్‌ కనిపిస్తాడు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసి సంతృప్తిగా ఉన్నాం అని అన్నారు. మా తమ్ముడు రుత్విక్‌ అమెరికాలో ఫిల్మ్‌ కోర్స్‌ చేశాడు. ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో నటించాడు.

అది చూశాక అతని టాలెంట్‌పై నమ్మకం కుదిరింది. మంచి ఛాలెంజింగ్‌ పాత్ర ద్వారా అతన్ని హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. అలా తెరకెక్కిన సినిమానే రాజా ది రాజా. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత అంతా ఈ సినిమాను మగధీరతో కంపేర్‌ చేస్తున్నారు. నిజానికి ఇది డిఫరెంట్‌ స్టోరీ అని నిహారిక దాసరి చెప్పారు. ఇందులో గ్రాఫిక్‌ వర్క్‌ అద్భుతంగా ఉంటుందని, కథానాయిక విశాఖ ధిమాన్‌ సహజంగా నటించిందని, నరేశ్‌, అవసరాల శ్రీనివాస్‌ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని, మైత్రీవారు విడుదల చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయని నిహారిక దాసరి ఆనందం వెలిబుచ్చారు. ఈ నెల 17న విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News