అగ్ర హీరో ప్రభాస్ తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కర్ణాటకలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి టిక్కెట్‌ను టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్‌లో భారీ ధరకు ఫస్ట్ టికెట్ ను బుక్ చేసుకున్నారు జక్కన్న. ఇక ఈ టికెట్ ధర చూసుకుంటే అక్షరాలా 10,116 రూపాయలు అని సమాచారం. ఇక రాజమౌళి ఫస్ట్ టికెట్‌ను ఇంత ధరకు కొనడంతో, ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.