Namaste NRI

శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా రాజంపేట రాణి   లిరికల్ సాంగ్ లాంచ్

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం నాతో నేను . ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు.

శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ  జబర్దస్త్‌  ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్‌ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే మాస్‌ బీట్‌ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్‌ నుంచి వెళ్లిన వేణు బలగం చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు.

నాతో నేను చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది అని నిర్మాత చెప్పారు.ఈ చిత్రంలో సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.   సాంకేతిక నిపుణులు:  కెమెరా: యూ్ణహ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events