సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం వేట్టయన్. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం. దుషారా విజయన్, రితికా సింగ్ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కి స్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రజినీ కాంత్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
ఈ మూవీలో మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర కామెడీ టచ్‌తో సాగుతుందని చెప్పి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. వేట్టయన్ ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో సందడి చేయనుండగా, విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.