
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా నుంచి రజనీకాంత్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన దేవా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చేతిలో 1421 నెంబర్ కలిగిన బ్యాడ్జీ పట్టుకొని రజనీకాంత్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, శృతిహాసన్, ఉపేంద్ర వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.
