విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం లాల్ సలాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూడా చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మెయిద్దీన్ భాయ్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఇటీవల పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ మీతో సినిమా చేయడం ఓ అద్భుతం. నాన్నా మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు. లాల్ సలాం లో మెయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సమర్పణ: సుభాస్కరన్.
