Namaste NRI

రజనీకాంత్ వెట్టయన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం వెట్టయాన్‌. తెలుగులో వేట‌గాడు అని వ‌స్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర‌న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్, మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ మూవీని మొదట 2024 ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ వెల్లడించిన విష‌యం తెలిసిందే. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. ఇప్పుడు తాజాగా తేదీని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events