Namaste NRI

రాజ్‌తరుణ్‌ తిరగబడరసామీ నుంచి చాలా బాగుందే

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తిరగబడరసామీ. ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంలో ఈ సినిమాలోని చాలా బాగుందే అనే పాటను విడుదల చేశారు. మెలోడీ ప్రధానంగా సాగే ఈ గీతానికి జేబీ స్వరాలను సమకూర్చగా శ్రీమణి సాహిత్యాన్నందించారు. నాయకానాయికల మధ్య అందమైన ప్రణయ భావనలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఓ సాధారణ యువకుడు వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు తెలిపారు. చైతు సత్సంగి, లిప్సిక ఈ పాటని మ్యాజికల్ గా పాడారు. శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా వుంది.  ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌ రెడ్డి, సంగీతం: జేబీ, మాటలు: భాష్యశ్రీ, రచన-దర్శకత్వం: ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events