Namaste NRI

రాజు యాదవ్ రియలిస్టిక్ ఎంటర్ టైనర్ అందరికీ కనెక్ట్ అవుతుంది: కృష్ణమాచారి

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం రాజు యాదవ్‌. కృష్ణమాచారి దర్శకత్వం.  కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.  దాదాపు 90 శాతం మంది మనుషుల్లో ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఏదో సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆయన ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తారు. ఈ స్ఫూర్తితో కథ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. నాకు సహజత్వం అంటే ఇష్టం. అందుకే ఈ సినిమాను ఓ రియలిస్టిక్‌ ఎంటర్టైనర్‌లా తెరకెక్కించాను. ఈ పాత్రకు జీవం పోసే నటుల కోసం వెతికే క్రమంలో గెటప్‌ శీను ఈ రోల్‌కు యాప్ట్‌ అనిపించింది. ఆయన చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా ఆయనకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ కంపోజ్‌ చేసిన పాటలు, సురేశ్‌ బొబ్బిలి నేపధ్య సంగీతం ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించిన దాని కంటే ఎక్కువ వినోదం, భావోద్వేగం కూడిన సన్నివేశాలు ఉంటాయి అని చెప్పారు. ఈ నెల 17న రాజు యాదవ్‌ విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events