Namaste NRI

రాక్షస కావ్యం సినిమా టీజర్ లాంఛ్

నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, దయానంద్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాక్షస కావ్యం. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను బలగం వేణు విడుదల చేశారు. ఈ సందర్భంగా  వేణు మాట్లాడుతూ  కొత్తగా ఏదైనా సినిమా చేయాలనే తపన ఉన్న టీమ్ అంతా కలిసి రాక్షస కావ్యం చేశారు. ప్యారలల్ సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్న బ్యాచ్ వీళ్లు. టీజర్ చూశాను చాలా బాగుంది. ఎదో కొత్తదనం సినిమాలో ఉండబోతోంది అని అర్థమైంది. మీకూ టీజర్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ప్యాషనేట్ టీమ్ ను ఎంకరేజ్ చేయండి. దాము,అన్న శ్రీమాన్, నవీన్, అన్వేష్, యాదమ్మ రాజు ఇలా అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్వేష్ కొత్త పోరడు వెబ్ సిరీస్ నన్ను ఇన్ స్పైర్ చేసింది. రాక్షస కావ్యం హిట్ కావాలని కోరుకుంటున్నా  అన్నారు.

 నిర్మాత దాము రెడ్డి మాట్లాడుతూ  ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఓ కొత్త తరహా చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందిస్తుంది అని తెలిపారు. కీర్తి మాట్లాడుతూ మన పురాణాల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. పురాణాల్లోని జయవిజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసులుగా పుట్టారు.వాళ్లు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం, సంగీతం: రాజీవ్‌ రాజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events