పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ అమ్మడు గత మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి పలు ప్రైవేట్ పార్టీలకు హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. గతంలో పెళ్లి గురించి అడిగినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా నని బదులిచ్చింది రకుల్‌ప్రీత్‌సింగ్. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 22న గోవాలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిసింది. అక్కడ ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సన్నిహితుల సమక్షంలో వైభవంగా పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)