Skip to main content

Namaste NRI

రామ్‌చరణ్‌‌ బర్త్‌డే స్పెషల్… పెద్ది బిగ్‌ అప్‌డేట్‌

రామ్‌చరణ్‌ రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా పెద్ది నిర్మాణం నుంచే భారీ హైప్‌ని క్రియేట్‌ చేస్తున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వం. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరై రారా పాటలు ఛార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ సినిమా గురించి బిగ్‌ అప్‌డేట్‌ను అందించారు.

ఈ నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకొని మాస్‌ ర్యాంపేజ్‌ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రామ్‌చరణ్‌కు స్వల్ప గాయం: పెద్ది చిత్రీకరణలో రామ్‌చరణ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ఎడమ కంటి దగ్గర చిన్న గాయమైందని మేకర్స్‌ తెలిపారు. రామ్‌చరణ్‌ పూర్తిగా క్షేమంగా ఉన్నారు. షూటింగ్‌ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆయన యథావిధిగా తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు అని మేకర్స్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు.ఈ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events