Namaste NRI

రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’.. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు సంబంధించి తాజా రిలీజ్ డేట్‌ను దర్శకుడు బుచ్చిబాబు సాన అధికారికంగా ప్రకటించారు. జూన్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఈ ప్రకటన తమిళ హీరో ధనుష్ నటించిన కర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బుచ్చిబాబు సాన, యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పెద్ది రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. దీంతో ఈ మూవీపై ఉన్న అనుమానాలకు తెరపడింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన బుచ్చిబాబు, తాను నేరుగా షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని తెలిపారు.

ప్రస్తుతం సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోందని, దాంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు శృతి హాసన్ కనిపించనుందని సమాచారం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను సొంతం చేసుకుంది.

Social Share Spread Message

Latest News