రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సంస్థ నుంచి రానున్న మరో ప్రతిష్టాత్మక చిత్రమిది. ప్రస్తుతం రామ్‌తో తెలుగు, తమిళ భాషల్లో ది వారియర్ సినిమాని నిర్మిస్తున్నాం. ఆ తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిదే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో చిత్రం తెరకెక్కుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : పవన్ కుమార్.
