Namaste NRI

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సెకెండ్ సింగిల్ రిలీజ్

రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్‌. పూరీజగన్నాథ్ దర్శకత్వం. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌ గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.  తాజాగా ఈ చిత్రం నుంచి మార్ ముంతా చోడ్‌ చింతా సెకెండ్ సింగిల్  ప్రోమోను లాంచ్ చేశారు. ఇస్మార్ట్‌ శంకర్‌లో ఫేమస్‌ అయిన మార్‌ ముంతా చోడ్ చింతా డైలాగ్‌నే సాంగ్‌గా పెట్టి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పూరీ. రామ్‌, కావ్య థాపర్‌ అండ్ టీంపై పార్టీ మూడ్‌లో సాగుతున్న ఈ మాస్‌ సాంగ్‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని ప్రోమో చెబుతోంది.

ధిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ సాగుతున్న టీజర్‌ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇస్మార్ట్‌ శంకర్‌కు స్పీకర్‌ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్‌ బస్టర్‌ ఆల్బమ్‌ రెడీ చేసినట్టు తాజా సాంగ్‌ చెప్పకనే చెబుతోంది. బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తు న్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events