Namaste NRI

రామ్‌-శ్రీలీల స్కంద.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ 

రామ్‌ కథానాయయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం స్కంద.  శ్రీలీల కథానాయిక.  శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ  సినిమాలో నీ చుట్టు నీ చుట్టు అనే తొలి గీతాన్ని ఈ నెల 3న విడుదల చేయబోతున్నారు. రామ్‌, శ్రీలీల కాంబోలో వచ్చే ఈ సాంగ్ కలర్‌ఫుల్‌గా విజువల్‌ ట్రీట్‌ అందించేలా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఈ పాటను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్‌  గ్రాండ్‌గా సెప్టెంబర్‌ 15న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ డిటాకే, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events