ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూస్తోంది. శతాబ్దాల కల నెరవేరుతున్న వేళ దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యకు జాతీయ- అంతర్జాతీయ ప్రముఖులు తరలి వచ్చారు. అన్ని రంగాల దిగ్గజాలు అయోధ్యలో చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుతున్నారు. దేశంలోనే కాదు విదేశాల్లొనూ అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ పండుగలా చేస్తున్నారు. న్యూయార్క్ ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. రాముడి భజనలతో హోరెత్తిస్తున్నారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది. అక్కడ ప్రవాస భారతీయు లు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.