టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు.యూత్ గెలవాలనే సందేశంతో ఈ సినిమా కథాంశం స్ఫూర్తినిచ్చేలా ఉందని ఆయన అన్నారు. చిత్ర హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ ఒక గ్రామంలో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్న యువకుడు చేసిన ప్రయత్నాలు..ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రామన్న యూత్. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కథాంశమిది. యువతకు సందేశాత్మకంగా ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో అనిల్ గిల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, రచన-దర్శకత్వం: అభయ్ నవీన్.
