Skip to main content

Namaste NRI

హిరణ్యకశ్యప గా రానా దగ్గుబాటి

హీరో రానా దగ్గుబాటి శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా తన కొత్త చిత్రం హిరణ్యకశ్యప ని ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశ్యపునిగా రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ టైమ్‌లెస్ లెజెండ్స్ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు. తాజాగా అమెరికాలోని శాండియాగోలో ప్రమోషన్‌లో భాగంగా రానాకు సంబంధించిన హిరణ్యకశ్యప పోస్టర్‌ను విడుదల చేసారు. ఇందులో రాక్షసుడిగా రానా గెటప్ బాగుంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అమర చిత్ర కథల స్పూర్తితో  ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News