Skip to main content

Namaste NRI

రాక్షస రాజు గా వస్తున్న రానా.. లుక్‌ అదిరింది

దర్శకుడు తేజ, రానా మళ్లీ వీరి కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది.  త్వరలోనే ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు. సినిమా పేరు రాక్షసరాజా. పేరుకు తగ్గట్టే శక్తిమంతమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో రానా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్టు తెలిసింది. హత్తుకుపోయే ఎమోషన్స్‌, కుటుంబ బంధాలతోపాటు నేరప్రపంచపు చీకటికోణాలు ఎత్తులు, పైఎత్తులూ అన్నీ ఈ కథలో ఉంటాయని సమాచారం. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌తో కూడిన పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో రానా విభూతి, తిలకం ధరించి సిగార్‌ కాలుస్తూ, చేతిలో తుపాకితో చాలా వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Social Share Spread Message

Latest News