ఉపేంద్ర హీరోగా శ్రీయా శరన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం కబ్జా. ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో మరో స్టార్ హీరో కిచ్చా సందీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇద్దరు స్టార్ హీరోల కాంబోతో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ కజ్జా తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్సు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టు భారీ స్టార్ క్యాస్ట్ కూడా సినిమాలో నటిస్తుండటంతో ఈ అంచనాలు నెక్స్ రేంజ్కు చేరుకుంటూ వచ్చాయి. అంత కంటే ముదే మేకర్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్సు మరింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటీ ఈ టీజర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు టీజర్ 25 మిలియన్ వ్యూన్ను సాధించి సన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న కజ్జా పలు బాషల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రానికి సంగీతం : రవి బస్రూర్, కెమెరా : ఏజే శెట్టి.