బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్, రష్మిక మంధాన ఫస్ట్ లుక్, బాబీ డియోల్ ఫస్ట్ లుక్ లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. రణబీర్ కపూర్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. అందరూ ఊహించినట్లే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన థ్రిల్లింగ్ యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. రణబీర్ కపూర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజర్‌ను చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుందనిపిస్తుంది.
పిల్లల గురించి ఆలోచించారా? అవును నేను తండ్రి కావాలనుకుంటున్నాను. నువ్వు నీ తండ్రిలా ఉండవు కదా.? అంటూ రణబీర్ కపూర్, రష్మిక మంధాన సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. రణబీర్ ఈ సినిమాలో రిచ్ కిడ్ అని తెలుస్తుంది. తన తండ్రి ఎంత చెడ్డవాడైన రణబీర్ మాత్రం నాన్నంటే తనకు హీరో అని చెబుతాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్‌ను డీప్ గా చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. క్రిమినల్‌ను కన్నామంటూ అనీల్ కపూర్ చెప్పిన డైలాగ్, కొడుకును మనిషిలా పెంచాలనుకుంటే, యానిమల్‌గా పెరిగాడనే బాధను స్పష్టంగా తెలియజేస్తుంది. మొత్తంగా ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య రివేంజ్ లా అనిపిస్తుంది.














