
భారతీయ ఇతిహాసగాథ రామాయణంను వెండితెర దృశ్యమానం చేస్తూ నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణ పాత్రధారిగా యష్ కనిపించనున్నారు. ఈ సినిమా మొదటిభాగం 2026 దీపావళికి, ద్వితీయ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గ్లింప్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఐమాక్స్ ఫార్మాట్‌తో తెరకెక్కిన రామాయణ గ్లింప్స్ ఆద్యంతం అధునాతన గ్రాఫిక్స్ హంగులతో అలరించింది. ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. మన సంస్కృతికి ఆత్మ వంటి రామాయణాన్ని అత్యంత శ్రేష్టతతో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నితేశ్ తివారి తెలిపారు.















