Skip to main content

Namaste NRI

రావు బహదూర్ విడుదల అప్పుడే

సత్యదేవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం రావు బహదూర్‌. వెంకటేశ్‌ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో రావు బహదూర్‌గా రాయల్‌గా కనిపిస్తున్న సత్యదేవ్‌ని చూడొచ్చు.

సంప్రదాయ దుస్తుల్లో, అధికారదర్పంతో కనిపిస్తున్న సత్యదేవ్‌, తలపాగాపై కనిపిస్తున్న ఆ పురుగు, ఇవన్నీ సింబాలిక్‌గా కథలోని ఏదో లోతైన అంశాన్ని చెబుతున్నట్టు గోచరిస్తున్నాయ్‌. ఇటీవల విడుదలైన తొలిపాట ఓ సుందరి చార్ట్‌బస్టర్‌గా నిలిచిందని, సత్యదేవ్‌, దీప థామస్‌లపై చిత్రీకరించిన ఈ మెలొడీని వింటేజ్‌ ప్రేమ ను ప్రతిబింబించేలా వెంకటేశ్‌ మహా తెరకెక్కించాడని మేకర్స్‌ చెబుతున్నారు.జూన్‌ 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ పర్మార్‌, సంగీతం: స్మరణ్‌ సాయి.

Social Share Spread Message

Latest News