రావు రమేష్ మొదటిసారిగా కథానాయకుడిగా, ప్రధాన పాత్ర పోషించిన సినిమా మారుతీ నగర్ సుబ్రమణ్యం. లక్ష్మణ్ కార్య దర్శకుడు, కాగా రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది మారుతీ నగర్ సుబ్రమణ్యం టీమ్. ఈరోజు ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. నేనే సుబ్రమణ్యం మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం నాకు నేనే ఇష్టం మీకేంటంట కష్టం మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాలోని పాటకు చెందిన పల్లవి ఇది. ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యానికి కల్యాణ్ నాయక్ బాణీ కట్టగా, రామ్ మిరియాల ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ లుంగీలో రావు రమేష్ గారి లుక్ బావుందని ఎంతో మంది మెసేజెస్ చేశారు. ఆయన్ను చూస్తే నేటివ్ ఫీలింగ్ వచ్చిందన్నారు. సినిమా సైతం అలాగే ఉంటుంది. నేటి విటీతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి కథ, భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలు వెల్లడిస్తాం అని చెప్పారు.