అల్లు అర్జున్ పుష్ప సినిమాతోనే ఉత్తమనటుడిగా జాతీయ అవార్డును అందుకొని, తెలుగులో ఆ క్రెడిట్ సాధించిన తొలి హీరోగా నిలిచారు. ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అభిమానులకు ఆయన ఐకాన్ స్టార్. ఇప్పుడు బన్నీ కీర్తికిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రపంచప్రఖ్యాతి చెంది న వారి మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మక మ్యూజియం దుబాయ్‌లోని బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న మేడమ్ టుస్సాడ్స్. ఆ మ్యూజియం వారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మైనపు బొమ్మను తమ మ్యూజి యంలో ఏర్పాటుచేశారు. ఈ బొమ్మను చూడటానికి మీడియా వారితోపాటు ఎంతోమంది ఇన్‌ఫ్లూ యెన్సర్స్ మ్యూజియంకు లైన్ కట్టారు. ఈ మైనపు బొమ్మ పర్‌ఫెక్ట్‌గా రావడానికి అల్లు అర్జున్ నుంచి 200 రకాల కొలత లను సేకరించామని సంస్థ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ మ్యూజియంలో మైనపుబొమ్మ ఏర్పాటు చేయడం పెద్ద గౌరవం అని, ఈ గౌరవం పొందిన తొలి సౌత్ ఇండియన్ నటుడు అల్లు అర్జునే అని వారు తెలిపారు.