Namaste NRI

ఏపీ విద్యార్థికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం.. అతిపిన్న వయసులో

విదేశాల్లో  వివిధ రంగాల్లో మన తెలుగువారు రాణిస్తున్న సంగతి తెలిసిందే.  సాఫ్ట్‌ వేర్‌తో చట్టసభల్లోనూ మన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  యువకుడు చట్టసభలకు ప్రతినిధిగా ఎంపికయ్యాడు. తన సమాజ సేవతో మెప్పించి ఆస్ట్రేలియాలో యువత కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు.  నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూషలు దంపతులు. రామకృష్ణ 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో సిర్థరపడ్డారు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉంటూ పిల్లలను అక్కడే చదవించుకున్నారు.  రామకృష్ణ పెద్ద కుమారుడైన తనూజ్‌చౌదరి(15) ప్రస్తుతం ప్లస్‌ వన్‌ (ఇంటర్‌) చదువుతున్నారు. సమాజ సేవా  కార్యక్రమంలో విస్తతృంగా పాల్గొంటున్నారు. అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తన కుమారుడిని ఎమ్మెల్సీగా అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిందని రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తన కుమారుడి అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని తెలిపారు. తెలుగు కుర్రాడికి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత లభించడం నిజంగా అభినందించాల్సిన విషయమే.

Social Share Spread Message

Latest News