చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సమావేశానికి యూఎస్ చేరుకున్న జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి చేరుకొని సైనిక విమానాల విన్యాసంతో, 100 అడుగుల (30 మీటర్ల) రెడ్ కార్పెట్‌తో ఘన స్వాగతం పలికారు. అమెరికా వైమానిక దళ బ్యాండ్ రన్‌వేపై కవాతు చేస్తుండగా, అమెరికా- చైనా జెండాలు రెపరెపలాడుతుండగా ట్రంప్ విమానాశ్రయంలోనే చైనా ప్రధానిని కలిశారు.

2015 తర్వాత వాషింగ్టన్లో షీ జిన్‌పింగ్ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే మే నెలలో ట్రంప్ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. నాడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంట్కు ఇలాంటి మర్యాదలు దక్కకపోవడం గమనార్హం.















