Namaste NRI

ఎన్ ఆర్ ఐ కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం

ఎన్‌ఆర్‌ఐ కోటేశ్వరరావుకు ఏపీయూ వేదిక కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ వారు తాజాగా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కావలికి ఏదైనా చేయాలనే తపనతో పలు సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అందులో భాగంగా బ్లడ్‌బ్యాంక్‌, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా శ్మశానవాటిక ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకు గతంలో హిందూ రతన్‌ అవార్డుతో పాటు పలు అవార్డులు వచ్చాయన్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్‌ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తానని ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events