యంగ్ హీరో నితిన్ భీష్మ దర్శకుడు వెంకీ కుడుమలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రంబృందం. అయితే ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా మరోసారి రష్మికనే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. భీష్మలో వీళ్ల జోడీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవడంతో మరోసారి ఇదే జోడీని కంటిన్యూ చేయాలని వెంకీ కుడుముల భావిస్తున్నాడు. త్వరలోనే రష్మికకు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడట. ఇక ప్రస్తుతం రష్మికకు పుష్ప తప్పితే మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు. పైగా టాలీవుడ్‌లో తనకు లైఫ్ ఇచ్చిన వెంకీ కుడుమలతో సినిమాకు నో చెప్పే చాన్సే లేదు. అన్ని కుదిరితే మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.