Namaste NRI

కుబేర నుంచి రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

ధనుష్‌, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కుబేర.  ఈ పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నది. శుక్రవారం రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌తో పాటు క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ట్రాలీ బ్యాగ్‌ పట్టుకొని కాస్త భయంతో కూడిన చూపులతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరిలో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నది. ఈ సోషల్‌డ్రామాలో రష్మిక మందన్న పాత్ర కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. సమాజంలోని సాంఘిక, ఆర్థిక అంతరాలను చర్చిస్తూ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా రని సమాచారం. ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress