అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడోసారి పదవీ కాలాన్ని పొడిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ మూడో సారి ఈ బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని తెలిపారు. సీఎం జగన్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చేపడుతున్న వివిధ పనులను అమెరికా సంయుక్తా రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులకు ఎప్పటికపుపడు తెలియజేస్తున్నామని తెలిపారు.