విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రత్నం. ప్రియా భవానీ శంకర్ కథానా యిక. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సీహెచ్ సతీష్‌కుమార్, కే రాజ్ కుమార్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశాల్ మాట్లాడుతూ రత్నం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, అన్ని కమర్షియల్ హంగులతో మెప్పిస్తుందని చెప్పారు. నేను సినిమాల పరంగా తొలి నుంచి ప్రయోగాలు, సాహసాలు చేస్తున్నా.ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయపడ్డాను కూడా. అయినా సరే అభిమానులను మెప్పించేందుకు మంచి కథలను ఎంచుకుంటున్నా అన్నారు.
రత్నం సినిమా గురించి చెబుతూ, గతంలో తాను దర్శకుడు హరితో భరణి, పూజ సినిమాలు చేశానని, అవి కమర్షియ ల్‌గా భారీ విజయాలు సాధించాయని, అదే తరహాలో రత్నం విజయం సాధిస్తుందని విశాల్ నమ్మ కం వ్యక్తం చేశారు. రత్నం నాశైలి యాక్షన్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నా కెరీర్‌లో ఓ విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది అని తెలిపారు. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విశాల్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే రత్నం చిత్రాన్ని తీసుకున్నాను. హరి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తు న్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హీరో విశాల్‌కి థాంక్స్ అని అన్నారు.