Namaste NRI

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రావణాసుర  ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం.  ర‌వితేజ‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు న‌టిస్తున్నారు.   ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. అక్కినేని సుశాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్‌ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ చేస్తున్నాడు. 

 తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతుంది. మేకర్స్‌ టీజర్‌లో పెద్దగా ఏమి రివీల్‌ చేయలేదు. ఓ క్రిమినల్‌ గురించి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చేసే వేట ఇదని స్పష్టమవుతుంది. టీజర్‌లో రవితేజ యాక్షన్‌ యాంగిల్‌ను చూపించగా, ట్రయిలర్‌లో రవితేజ మార్క్‌ కామెడీ కనిపిస్తుంది. ఓ వైపు సాఫ్ట్‌ క్యారెక్టర్‌ మరోవైపు వైల్డ్‌ క్యారెక్టర్‌లలో రవితేజ నటన వేరే లెవల్లో ఉండబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా హర్షవర్ధన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌ను ఎక్కడితో తీసుకెళ్లిపోయింది. మర్డర్‌ చేయడం క్రైమ్‌, దొరక్కుండా చేయడం ఆర్ట్‌,  ఐ యామ్‌ ఎన్‌ ఆర్టిస్ట్‌ ఈ భూమి మీద నన్నేవడైనా ఆపగలిగే వాడున్నాడంటే అది నేనే  అనే డైలాగ్స్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మాస్‌తో పాటు క్లాస్‌ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ట్రైలర్‌ను బాగా కట్‌ చేశారు. ట్రైలర్‌ గమనిస్తే రవితేజ లాయర్‌ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మొత్తంగా టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events