Namaste NRI

ప్యార్‌లోన పాగల్ అంటున్న రవితేజ

రవితేజ హీరోగా నటించిన సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో  కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యాన‌ర్‌పై  స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.  అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన రావణాసుర ఆంథమ్ ఇన్‌స్టాంట్‌గా  ఎక్కేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ప్యార్‌లోన  పాగల్ అంటూ సాగే సెకండ్ పాటను ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించాడు. హర్షవర్ధన్ సరికొత్త ట్యూన్స్ శ్రోతలను ఆట్టుకుంటున్నాయి. మొదటి పాటలానే, ఈ పాట కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తు న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events