Skip to main content

Namaste NRI

రవితేజ ఈగల్‌ మూడో సాంగ్‌ లాంఛ్

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా,  నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రా న్ని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మాస్‌ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మూడో సాంగ్‌ ఈగల్స్‌ ఆన్‌ హిస్‌ మే ను కూడా లాంఛ్ చేశారు. ఈ పాటను దావ్‌ జాంద్  కంపోజిషన్‌లో జార్జినా మాథ్యూ స్వయంగా రాసి పాడారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి  దావ్‌ జాంద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events